Udyogam Oodipoyindi

by Ranjith

Lyrics : M.M. Keeravani
Music : M.M. Keeravani
Arranger : M.M. Keeravani
ఉద్యోగం ఊడిపోయింది..పోయిందా...పొ పొ పొ ...పోయిందా..
సద్యోగం సంతకెళ్ళింది...గోవిందా.. గొ గొ గొ ...గోవిందా..
గోదారి ఈదాలంటే.. కుక్కతోకైనా లేదండీ..
ఏ దేవుడి నడగాలన్నా.. హుండికి చిల్లర లేదు..
పెదవి ఎండిపోతుంది.. కడుపు మండిపోతుంది..
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
ఎందుకిలా నా ఖర్మ నా ఖర్మ కాలిపోయిందహా
మై లైఫ్ తలకిందులు కిందులు
మై వరల్డ్ తలకిందులు కిందులు
ఎవిరీథింగ్ తలకిందులు కిందులు
తలకిందులు కిందులు ..తలకిందులు కిందులు..తలకిందులు కిందులు
ఎవడండీ బాబూ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు..
కృషి ఉంది.. దుర్భిక్షం కూడా ఉంది..
శకలాపా ళకళకలాపా శకలాపా ళకళకలాపః
చెమటోడ్చే మనుషులకి ఏలోటూ రానే రాదంటారు..
ఏమైందీ.. ఆ చెమటేగా మిగిలింది..
ఛీ అంది.. చేతిలో గీత
నలిగింది.. నుదిటిపై రాత..
టోటల్ గా చీకటయ్యిందీ లైఫంతా..
పెదవి ఎండి పోతోంది... కడుపు మండి పోతోంది
పులుసు కారిపోతుంది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది..
శని బాబాయ్ షాడోలా వెంటాడుతున్నాడేమో  నన్ను..
పనిలేదు.. పాకెట్లో పైసాలేదు..
శకలాపా ళకళకలాపా శకలాపా ళకళకలాపః
దురదృష్టం అయస్కాంతంలా లాగుతున్నాదనుకుంటాను..
ఏం చేయను.. నే ఐరెన్ లెగ్గయ్యాను..
భిచ్చమెత్తరా..సిగ్గుపడతాను
జేబు కత్తెర..వెయ్యనే లేను
చచ్చిపోమరి.. అంతపని చచ్చినా బాబోయ్ నే చేయలేను...
లక్కు లాగి తన్నింది.. తుక్కు లేచిపోయింది..తిక్క తీరిపోయింది..
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.
ఎందుకిలా నా కర్మ కాలిపోయింది.